<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పితతో ఇంటర్యూ పార్ట్ – 2 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

2 Feb 2014

పద్మార్పితతో ఇంటర్యూ పార్ట్ – 2







పద్మం: ఇది కొంచెం పర్సనల్. తప్పుగా అనుకోవద్దు. మీ అసలు పేరేంటి?
పద్మార్పిత: ఇది అసలు పేరు కాదని ఎందుకనుకుంటున్నారు?
పద్మం: ఉహూ.. అదేం కాదు. సాధారణంగా ఏ పద్మ అనో, పద్మజా అనో, పద్మావతి  అనో.. పెట్టుకుంటారు. ఇలాంటి పేరు చాలా అరుదు అసలు నేనెప్పుడు వినలేదు కుడా. నిజం చెప్పాలంటే పద్మ  అనే పేరుకి తర్వాత ఇంకొకటి చేర్చాలంటే అది కుడా అర్పితా లాంటి గొప్ప అర్థం ఉన్న పేరును కలపాలంటే ఏంతో అంతర్మధనం చేసిఉండాలి, ఏంతో ఉన్నతమైన భావాలు ఉండాలి అని అనిపించి అడిగాను అంతే.!
పద్మార్పిత: బాబోయ్! ఇంతగా ఆలోచిస్తారా నా పేరు గురించి? నా సర్టిఫికెట్స్ చూపించనా? ఎందుకంత అనుమానం.
పద్మం: అయ్యయ్యో! ఏదో సందేహం కొద్ది అడిగానే కానీ అనుమానం మాత్రం కాదు సుమా.
పద్మార్పిత: ఓహో.. సందేహానికి, అనుమానానికి తేడా ఏంటో మరి? చెప్తావా..
పద్మం: నీకు తెలియని తేడాలా. జీవితాన్నే కాచి వడబోసినట్లు కవితలు రాసేస్తావ్ గా.. నన్నాట పట్టిస్తున్నావా? తల్లీ!
పద్మార్పిత: అవునా! సరే గానీ నేనంటే నీకు ఇష్టమా?
పద్మం: బోలెడంత ఇష్టం.
పద్మార్పిత: నీక్కూడానా. L  ఎందుకని నేనంటే అందరూ తెగ ఇష్టపడతారు?
పద్మం: నేను కదా నిన్ను ఇంటర్యూ చేద్దామని వచ్చాను. ఇలా నువ్వే నన్ను క్రాస్ కొశన్స్ వేస్తె ఎలా?
పద్మార్పిత: సరే! వద్దులే. అడుగు.
పద్మం: అలగమాకు పద్మార్పిత. చెప్పడానికి ట్రై చేస్తాను.
పద్మార్పిత: ట్రై చేయడం కాదు. నిజాలు చెప్పు. చాలు. నన్ను ఇష్టపడుతున్నారా? లేదా నా భావాలను ఇష్టపడుతున్నారా?
పద్మం: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. అయినా చెప్తాను విను. ఇన్ని భావాలను రాసి మెప్పించే నిన్ను ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా?
పద్మార్పిత: ఏమో అనుకున్నాను. గడసరివే నువ్వూ. అయినా నన్ను చూడకుండా ఇష్టపడడం ఏంటి? కొందరైతే నన్ను ప్రేయసిగా భావించి కవితలు కూడా అల్లేస్తున్నారు. దీన్నేమంటావ్?
పద్మం: నువ్వంటే ప్రేమంటాను. అవును! అభిమానమైనా, స్నేహమైనా, ఇష్టమైనా, ఆరాధనైనా మొదట ప్రేమతోనే ప్రారంభం అవుతాయి. అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు.
పద్మార్పిత: అర్థం కాలేదు.
పద్మం: ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకు. సాధారణంగా సినిమా హీరోయిన్లను అభిమానించే వాళ్ళు, ఆ హీరోయిన్లను తలుచుకుని కవితలు రాయరా? కలలు గానరా? రాం గోపాల్ వర్మ అంతటివాడే శ్రీదేవి అంటే పడి చస్తాడు. ఇదీ అంతే! ఇంకా అర్థం కాలేదు అని అంటే నీకు చెప్పడం నా వల్ల కాదు.
పద్మార్పిత: ఇది కూడా బాగుందిలే! సరే, ఈ ఉపదేశమాపి వచ్చిన పని కానివ్వు. నాకు చాలా పనులున్నాయి.
పద్మం: హమ్మయ్య! దారికోచ్చారు. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మీరు బొమ్మలు గీయడంలో కుడా దిట్ట అంట కదా. ఇలా కుంచె పట్టుకొని అలా గీసేస్తారంట.
పద్మార్పిత: మరీ ఇంతలా అడక్కు. నావేవో పిచ్చి గీతలు.
పద్మం: చాల్లెండి. ఇలా ప్రతీదానికీ పిచ్చి గీతలు పిచ్చి రాతలు అంటూ మమ్మల్ని పిచ్చోళ్ళు చేసేసారు. మాకంతా తెలుసు. ఎగ్జిబిషన్ పెడితే చూసి తరిస్తాం కదా. మీరే గీసుకొని మీరే చూసుకొని మీరే మురిసిపోవాలా?
పద్మార్పిత: మరీ ఎగ్జిబిషన్ లాంటి గొప్ప మాటలెందుకులే! కాలమే సమాధానం చెబుతుందిలే.
పద్మం: ఇలా తెలివిగా తప్పించుకోవడం మీకు అలవాటేగా. మీరు కామెంట్స్ కి ఇచ్చే పిప్లయ్ కోసం చాలా మంది కాచుకుని కుర్చుంటారంట. మరేమో మీరు కొన్ని పోస్ట్ లకు అసలు రిప్లయ్ లు ఇవ్వకుండానే దాటేస్తారు. ఎందుకో??
పద్మార్పిత: ఇంకా అడగలేదని చూస్తున్నా. నేనేమైనా ఇంటర్నెట్కి అంకితమైపోయి, ఎప్పుడూ ఆన్లైన్లోనే గడుపుతాను అనుకుంటున్నావా? అందరిలాగే నాకు ఏవోవో వనులు ఉంటాయిగా. అయినా, అందరికోసం వీలు కల్పించుకొని రాస్తున్నాగా. అయినా చాలా మంది నాకు పొగరు అని అనుకున్నా అతిశయోక్తి కాదేమో?!!
పద్మం: అర్పిత గారు, మీకో నమస్కారం తల్లీ. పద్మార్పితకి పొగరని అంటే మా కళ్ళు పోతాయ్...
పద్మార్పిత: మళ్ళీ ఇంకో అభాండమా నాపైన?
పద్మం: అలాకాదు పద్మా...  ఇంకో పర్సనల్ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం. అలా అని దాటేయకు సుమా...
పద్మార్పిత: అబ్బో!! ఏంటో అది.
పద్మం: మీకు పెళ్లయిందా???



(ఇదంతా కేవలం కల్పితం. అలా అని అబద్ధం కానవసరం లేదు. నిజం అంతకన్నా కానవసరం లేదు.   )


To be continued in next part....   



24 comments:

  1. ఆవిడ కవిత చదివి ఆతృతగా ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్క ప్రశ్నకీ సమాధానం ఇవ్వకుండా ఇలా కంటిన్యూ అని నిరాశపరిస్తే ఎలాగండి.

    ReplyDelete
    Replies
    1. మనిషి ఆశావాది కదా! వెయిట్ ఫర్ నెక్స్ట్ పోస్ట్ మహీ ...

      Delete
  2. నాకేం అర్థంకాలేదు...మళ్ళీ వచ్చి కమెంట్ పెడతాను

    ReplyDelete
    Replies
    1. టేక్ యువర్ ఓన్ టైం... కానీ మళ్ళీ రండి... ప్లీజ్

      Delete
  3. రచయితలకు, రచయిత్రులకు అభిమానులుండడం సహజమే. అయితే ఇక్కడ మీరు ప్రచురించిన "పద్మార్పిత తో ఇంటర్వ్యూ " - అదేమిటో కాస్తా నిరుత్సాహమే కలిగించింది. ఎందుకో ఈ"ఇంటర్వ్యూ " విధానం అంత సమంజసంగా అనిపించలేదు. రచయిత నో (అతను) లేక రచయిత్రో ( ఆమెనో ) తెలియని స్తితిలో ఇలా మిమ్ము ప్రేమిస్తున్నాను , మీకు పెళ్లయిందా అన్న పదాలు వాడి ఎక్కడో హద్దులు దాటామా అనే బాధ కల్పిస్తుంది . పర్సనల్ విషయాల్లో encroach అయినట్టుగా అనిపించడం లేదూ ! "పద్మార్పిత"గా రు గొప్ప రచనలను అందించి అభిమానుల్ని ఎంతగానో అలరిస్తున్నారు. దయచేసి తప్పుగా అనుకోవద్దు నేనూ అందరిలా 'పద్మార్పిత' గారి అభిమానినే. ఇది నాకు నచ్చలేదు ఎందుకో అని చెప్పడానికే నా ఈ ప్రయత్నం ,ఎంత కాదనుకున్నా , కల్పితం అని మీరు రాసినా , ఎక్కడో నిజమే కావచ్చని అనుమానం కుడా రాక పోదు కొందరికైనా . మరి ఎందుకీ ప్రయత్నం ?
    - శ్రీపాద
    ( ఓ అభిమాని )

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారు.. మీ కామెంట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంకో వైపు నుంచి చుస్తే పద్మార్పితా గారిపై అనేక మంది సందేహాలను, అభిప్రాయాలను వేలిబుచ్చుతున్నారు. వాటి నివృత్తికై కొంచెం ఇలా వ్యక్తిగత వివరాలను సున్నితంగా తాకవలసివస్తోంది. నిజానికి ఈ బ్లాగ్ ఉద్దేశ్యం అది కాదు. రాబోయే పోస్టుల్లో గమనించగలరని విన్నపం. సదా మీ అభిమానం ఆమె పై ఉండాలనీ ఆసిస్తూ....

      Delete
  4. మొదటిభాగం ఇంటర్వ్యూ ఎగసిపడే కెరటమైతే, 2వభాగం సునామీ ముందు ప్రశాంతలా ఉంది...మొత్తానికి బ్లాఘర్ ఏదో సృష్టించబోతున్నారు అనడానికి ఇది సంకేతమేమో

    ReplyDelete
    Replies
    1. వేచి చూడగలరు మార్కండేయ గారు...

      Delete
  5. అసలు ఏం చెప్పాలని ఈ ఇంటర్వ్యూ??????

    ReplyDelete
    Replies
    1. మీరేగా సీరియల్ గా చెప్పమన్నారు...

      Delete
  6. Without enjoying da writings.....why do u interfere into da personal matters? As v r humans....give space..... As a fan..
    I turn down this.

    ReplyDelete
    Replies
    1. @ Anu... Is there any interview with out containing the questions regarding to personal matters??

      Delete
    2. There r....n I can agree with u when u did da intrw with da person directly....but all this....Ur imagination...is hurting fans....here we need to share our views rega da writings but not to express one's own personal emotions....

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. పద్మార్పితగారు మీరు ఎందుకు ఏం స్పందించడంలేదు అని చాలామంది అడిగిన ప్రశ్నలకు నేను విడిగా మెసేజ్ చేసాను.....అవి సంతృప్తికరమైన సమాధానాలే అని భావిస్తున్నాను.
    నాకు తెలిసి ఎవ్వరినీ నొప్పించడం నా ఉద్దేశం కాదని ఇక్కడ మరోమారు బ్లాగ్ ముఖంగా తెలియజేసుకుంటూ.....
    అభిమానం
    అనేది
    అల్లరిగా
    అనురాగం
    ఆప్యాయత
    అహ్లాదకరమై
    ఆరోగ్యవంతమైన
    అనుబంధాన్ని కూర్చి
    అందరం ఒకటన్న భావాన్ని
    అందించాలని "పద్మార్పిత" ఆశ.
    అది ఇక్కడ ఉందని, ఉండాలని, ఉంటుందని సదా నమ్ముతూ....ఆదరిస్తున్న ప్రతి అభిమానికి అర్పిత అభిమానపూర్వక అంజలి_/\_

    ReplyDelete
    Replies
    1. నీలో దాగిన సంస్కారానికి చిహ్నం ఈ సమాధానం.
      నీలోని నిగర్వానికి వంగి వంగి అవుతున్నా నేను గులాం.
      నీ భావాల పరిమళాలని మాకందరికీ అందించు కలకాలం.
      జయహో పద్మార్పితా జయహో...హరినాధ్

      Delete
    2. సరళపదాలతో శాంతింప చేయడం మీకు తెలిసిన అపూర్వవిద్య. ఇక్కడ అదే ప్రయోగించి మనసులో నిలిచారు.

      Delete
    3. Thanks for understanding Madam. Its our pleasure to have your openion here...
      _/\_

      Delete
    4. ఇక్కడ కూడా ఇలా హృదయానికి హత్తుకోవాలా????

      Delete
  9. ఏం మాయచేస్తున్నారో ఏమో?:-)

    ReplyDelete
  10. ఈ బ్లాగ్ చూస్తుంటే విశ్వమాయలా అనిపిస్తుంది....ఎవరు ఎక్కడివారో తెలిసీ తెలియని ఈ అనుబంధాలు, అసూయ, అనురాగాధ్వేషాల మయంలా తోస్తుంది. అయినా ఎంతో బాగుంది.

    ReplyDelete
  11. Love is Universal but Life is Personal, so express love openly but Life don't open it my friend :-)

    ReplyDelete
  12. ఈ ఇంటర్వ్యూలో ఏదో లోపించింది.

    ReplyDelete